పత్తికొండ: పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు ఇంటింటికి వెళ్లి నూతన పింఛన్లు పంపిణీ
తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఇంటింటికీ వెళ్లి నూతనంగా మంజూరైన వితంతు, వృద్ధాప్య, వికలాంగుల ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను సోమవారం పంపిణీ చేశారు. గతంలో రూ. 200 ఉన్న పెన్షను చంద్రబాబు రూ. 2000కి పెంచారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.