అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ కేసుకు సంబంధించి నిందితులను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు వారి సహచరులతో ఆసుపత్రి ప్రాంగణం నిండిపోయింది. భారీ బందోబస్తు మధ్య వారిని తరలించారు.