మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం వ్యవసాయ గోదాంలో ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు రావడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వోఆర్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.