సిద్దిపేట అర్బన్: నెలరోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి:రాష్ట్ర భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం అధ్యక్షులు దరిపల్లి చంద్రం
రాష్ట్ర ప్రభుత్వం నెలరోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సెక్రెటరేట్ ను ముట్టడిస్తామని రాష్ట్ర భవన నిర్మాణ రంగా కార్మిక సంఘం అధ్యక్షులు దరిపల్లి చంద్రం తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో .రాష్ట్ర భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం అధ్యక్షులు దరిపల్లి చంద్రం, వివిధ జిల్లాల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. గతంలో కార్మికులకు రూ 10 లక్షల బీమా ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగినట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను, పర్మిట్ రూములను బంద్ చేయాలని వారు డిమాండ్ చేశారు.