తలుపులలోని ఎగువపేటలో పెద్ద మక్కాన్ పీర్ల ఊరేగింపు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తలుపుల మండల పరిధిలోగల ఎగువపేట పెద్ద మక్కాన్ పేరుతో పీర్ల ఊరేగింపును వైభవంగా ఆదివారం రాత్రి నిర్వహించారు. ఎగువపేట తో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి పీర్లు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. అన్ని పీర్లు ఒక్కచోటకు చేరి ఐక్యతను చాటుకున్నాయని గ్రామస్తులు తెలిపారు. డప్పు వాయిద్యాల నడుమ యువత నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపు కొనసాగింది.