సుండుపల్లి: సుండుపల్లి మండల సమస్యలపై చర్చించిన చమర్తి జగన్మోహన్ రాజు
సుండుపల్లి మండలం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చప్పిడి రమేష్ నాయుడు ఆహ్వానం మేరకు రాజంపేట ఇన్చార్జి చామర్తి జగన్మోహన్ రాజు ఆదివారం మండలాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా మండలంలో పరిష్కారం కావలసిన పలు స్థానిక సమస్యలపై సమగ్రంగా చర్చించారు.కొత్త మండల అధ్యక్షుడిని జగన్మోహన్ రాజు అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.