దుబ్బాక: ఐదారు నెలలు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయి - దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం గొల్లపల్లి గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణమహోత్సవం లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి దయ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో ముదిరాజ్ లకు ప్రతి చెరువులో చేపల పెంపకం జరిపామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆరు నెలలు ఓపిక పడితే ముదిరాజ్ లకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పారు.