గుంతకల్లు: గుత్తి జి ఆర్ పి కానిస్టేబుల్ వాసు పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సీనియర్ టిడిపి నాయకుడు కోనంకి కృష్ణ
గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో టిడిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై సమావేశం ఏర్పాటు చేయగా 24వ వార్డుకు సంబంధించి చర్చిస్తున్న సమయంలో గుత్తి రైల్వే జి ఆర్ పి కానిస్టేబుల్ వాసు ఎనిమిది మంది అనుచరులతో వచ్చి నీకు 24 వ వార్డు ఏం సంబంధం అంటూ నాపై దాడికి దిగాడు అంటూ సీనియర్ టిడిపి నాయకుడు కోనంకి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వాసు పై గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడని అదేవిధంగా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు వీడియో విడుదల చేశాడు