అనంతపురం జిల్లా మరూరు లో మహిళ అనుమానాస్పద మృతి
Anantapur Urban, Anantapur | Mar 27, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలం మరూరు సమీపంలో లక్ష్మీదేవి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం గమనించిన గ్రామస్తులు ఆమెను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.