అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువులో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని చందన లక్ష్యం పల్లి గ్రామానికి చెందిన బండి శ్రీనివాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ యాడికి నుండి చందన లక్ష్యం పల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా రాయల చెరువులో ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి యాడికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.