దర్శి: అన్నా క్యాంటీన్ ను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపిన టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో అసంపూర్తిగా వదిలేసిన అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణం చేపట్టుటకు చర్యలు చేపట్టడం జరిగిందని దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. నిరుపేదలకు ఎంతోమంది ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్ త్వరితగతిన పూర్తి చేసి గాంధీ జయంతి అక్టోబర్ 2 తేదీ ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. త్వరలో పేదలకి అన్నా క్యాంటీన్ సదుపాయం అందుతుందని అన్నారు