సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు కాలనీలలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, నిర్వహించిన సి,ఐ,టి,యు నాయకులు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని, ఆత్మకూరు పట్టణంలోని, గరీబ్ నగర్, వెంగళరెడ్డి నగర్, ఏకలవ్య నగర్, ఇలా పలు కాలనీలలో ముగ్గుల పోటీలు మహిళలకు చిన్నారులకు ఆటల పోటీలను, సి,ఐ,టి,యు మరియు ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు, గెలుపొందిన మహిళలకు చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు, ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ, మోడీ పాలనలో ఎన్నడూ లేనివిధంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయానే విమర్శించారు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు,