గంగాధర నెల్లూరు: తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి: జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్
తుఫాన్ పట్ల జీడీనెల్లూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదివారం అన్నారు. రానున్న మూడు రోజులు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు నీటి ప్రవాహాలు ఉన్న చోటుకు పిల్లలను పంపొద్దని సూచించారు.