చొప్పదండి: భారీ వర్షాల నేపథ్యంలో చొప్పదండి నియోజకవర్గం ప్రజలకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఓ ప్రకటనలో పలు సూచనలు చేశారు. ప్రజలు తప్పనిసరి అయితే తప్ప బయటకి వెళ్లొద్దని కోరారు. భారీ వర్షాలు నేపథ్యంలో చిన్నారులు వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.తాత్కాలిక నిర్మాణాలకు,పాతభవనాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు