అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని బాబు జగ్జీవనరామ్ కాలనీలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. శుక్రవారం విఘ్నేష్ అనే బాలుడికి చాక్లెట్ ఇస్తానని చెప్పి ఓ గుర్తుతెలియని మహిళ బాలుడిని ఎత్తుకెళ్లడానికి యత్నించిందని స్థానికులు ఆరోపించారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని జగ్జీవన్ రామ్ కాలనీకి చెందిన శ్రీనివాసులు, సుజాత దంపతుల కుమారుడు విగ్నేష్ ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాడు. అయితే బిక్షాటన నెపంతో వచ్చిన ఓ మహిళ విగ్నేష్ ను ఎత్తుకెళ్తుండగా కాలని వాసులు గమనించి ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడగగా పొంతన లేని సమాధానం చెప్పింది. దీంతో మహిళకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు