అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లోని అత్యవసర వైద్య విభాగంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పి కొండాపురం గ్రామానికి చెందిన రామదాస రెడ్డి అనే వృద్ధుడు మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం కామెడీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.