పత్తికొండ: మద్దికేరలో వరిగడ్డి మిషన్ కింద పడి వ్యక్తి మృతి
పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేరలో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. వరిగడ్డి మిషన్ కిందపడి ఎండే నాగన్న (52) అనే రైతు మృతి చెందారు. పంట కోతకు కూలీగా వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు మిషన్ కింద పడిపోయారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.