పాణ్యం: ఓర్వకల్లు భవితా కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
ఓర్వకల్లు మండల పరిషత్ పాఠశాల భవితా కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఎంఈఓ జి. ఓంకార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న అలవెన్సులు, ఫిజియోథెరపీ వంటి సౌకర్యాలను వివరించారు. జిల్లా స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో విజేతలైన దివ్యాంగ చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ కిరణ్ మనోహర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.