నగరి: ఎన్. టి. ఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భాను ప్రకాష్
నగరి నియోజకవర్గం లో పండుగలా ఎన్. టి. ఆర్ భరోసా పెన్షన్ ల కార్యక్రమం సోమవారం జరిగింది. నిండ్ర మండలం చవర బాకం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునిందని తెలిపారు.