కణేకల్లు మండల కేంద్రంలో బంగారు వ్యాపారి లతీఫ్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఐదులోజుల క్రితం లతీఫ్ కుటుంబం హైదరాబాద్ కు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి రూ20 లక్షల విలువజేసే 16 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, రెండు లక్షల నగదు విలువైన డాక్యుమెంట్లను దోచుకెళ్లారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.