గనిలో రైతులకు పథకాలపై ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అవగాహన
Panyam, Nandyal | Nov 29, 2025 గడివేముల మండలం గని గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతన్నా–మీకోసం కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శనివారం ఆమె గ్రామంలో రైతుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో పారిశుధ్య సేకరణ కోసం నూతన ట్రాక్టర్ను ప్రారంభించారు. అలాగే పశుసంవర్ధక శాఖ ద్వారా పశువుల దాణా సబ్సిడీని రైతులకు అందజేశారు.