పూతలపట్టు: పూతలపట్టులో రైలు ఢీకొని 13 ఆవులు మృతి
పూతలపట్టు మండలం అమ్మేపల్లి సమీపంలో మంగళవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ట్రైన్ ఢీకొని 13 ఆవులు మృతి చెందాయి. స్థానికుల కథను మేరకు తిరుపతి వైపు నుండి చిత్తూరు వైపు వస్తున్న ట్రైన్ కలికిరి కొండ దేవస్థానానికి చెందిన 10 ఆవులను అమ్మేపల్లి సమీపంలో ఢీకొంది. మరో మూడు ఆవులు సామనత్వం వద్ద ఢీకొండంతో మొత్తం 13 ఆవులు మృతి చెందాయి. స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజలు ఎగబడి ఆవు మాంసం కట్ చేసుకుని తీసుకెళ్లారు.