ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందుకున్న స్టేషన్ ఘన్ పూర్ 108 ఎమర్జెన్సీ సిబ్బంది
స్టేషన్ ఘన్ పూర్ మండల పరిధిలోని 108 ఎమర్జెన్సీ సిబ్బంది రాష్ట్రస్థాయిపురస్కార అవార్డులను సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో అందించారు. స్టేషన్ ఘన్ పూర్ పరిధిలో 18 ఏళ్లుగా 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ లో అత్యున్నతమైన సేవలు అందించిన సిబ్బంది హరికృష్ణ, యాకయ్యలను గుర్తించి రాష్ట్రస్థాయి అవార్డును అందించారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవలందించిన సిబ్బందిని గుర్తించగలరు. అంబులెన్స్ ద్వారా ప్రాణాపాయ స్థితికి లో ఉన్న వారిని అధిక సంఖ్యలో కాపాడినందుకు వారికి అవార్డులను అందించారు.