అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం రాప్తాడు సిఐ శ్రీహర్ష మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు సీఐ శ్రీహర్ష మాట్లాడుతూ 44వ జాతీయ రహదారిపై ముగ్గురు యువకులు గంజాయి సేవించి త్రిబుల్ రైడింగ్ చేస్తూ బైక్ పై స్ట్రెంట్లు చేస్తున్నారని సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడం జరిగిందని వీటి పైన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టడం జరిగిందని అయితే సోషల్ మీడియాలో అవాస్తవాలను పోస్ట్ చేయడం జరిగిందని విచారణ చేపట్టి బైక్ నడిపిన తల్లిదండ్రులకు ఫైన్ కూడా వేయడం జరిగిందని రాప్తాడు సిఐ శ్రీహర్ష పేర్కొన్నారు.