పాకాల హైవే పై రోడ్డు ప్రమాదం
పాకాల మండలం కోనప్ప రెడ్డి పల్లె వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది నరేష్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుపతి నుంచి చిత్తూరుకు బయలుదేరారు మధ్యలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీ కొట్టింది కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.