ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ నాయకులు కరుణాకర్ మాట్లాడుతూ కార్మిక కర్షకుల కోసం నిరంతరం పోరాటం చేసిన పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మిక హక్కుల చట్టాలను సాధించుకున్నామని నేడు ఆ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు.