ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే వరదని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీసీ సంఘం నాయకులు
Proddatur, YSR | Nov 25, 2025 కడప జిల్లా పొద్దుటూరులో గత నాలుగు రోజుల క్రితం నగల వ్యాపారి అయినా తనికంటి శ్రీనివాసులు అతని సోదరుడు వెంకటస్వామి లను పోలీసులు అన్యాయంగా నిర్బంధించి వారిపై భౌతిక దా డి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని పద్మశాలీ అభ్యుదయ సంఘం అధ్యక్షుడు వద్ది నరసింహులు తెలిపారు. వాణిజ్య కేంద్రం అయిన ప్రొద్దుటూరులో వ్యాపారులపై ఇలాంటి దాడులు పోలీసులే చేయడం వలన వ్యాపారులు భయాందోళనకు గురయ్య పరిస్థితి ఉందని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారి చొరవతో పోలీసుల చర నుంచి వ్యాపారస్తులను సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగిందని మంగళవారం సాయంత్రం కామనూరు నివాసం నందు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి