అనంతపురం నగరంలోని పాతూరు లో ఉన్న నారాయణరెడ్డి కాలనీలో శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో రోడ్డుపైన వాకింగ్ చేస్తుండగా షేక్ మహబూబ్ బి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. షేక్ మహబూబ్బికి చేయి విరగడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.