మంత్రాలయం: పెద్ద కడబూరులోని చిన్నతుంబళం సమీపంలోని మాధవరం రహదారిలో నాప బండల లోడు తో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు దగ్ధం
పెద్ద కడబూరు: మండలంలోని చిన్నతుంబళం సమీపంలోని మాధవరం రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నాప బండల లోడుతో వెళుతున్న లారీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. తాండూరు నుంచి కేరళకు నాప బండల లోడుతో వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలి ఇంకా తెలియాల్సి ఉంది.