బాలల సంక్షేమం – విద్యా ప్రమాణాల మెరుగుదల కు కృషి చేస్తున్నాం అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ రాయపాటి శైలజ సోమవారం రాత్రి 7 గంటలకు కర్నూలు పెద్దపాడు లో దామోదరం సంజీవయ్య బాల సదనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులు, వసతి గృహ అధ్యాపకులు చైర్పర్సన్కు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా బాల్యవివాహాల నివారణ అంశంపై విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చైర్పర్సన్ విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడ