సాత్విక బలి కుంభోత్సవాన్ని పురస్కరించుకొని కొబ్బరికాయల సమర్పణ ,కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీశైలం అధికారులు, అర్చకులు.
శ్రీశైలంలో భ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. చైత్రమాస పౌర్ణమి అనంతరం జరిపే కుంభోత్సవాన్ని పురస్కరించుకొని, అమ్మవారికి సాత్త్వికబలి కోసం కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 7న కుంభోత్సవం జరగనున్న నేపథ్యంలో, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు శుక్రవారం ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి, అనంతరం అమ్మవారికి సమర్పించారు.