అనంతపురం నగరంలోని టీవీ టవర్ సమీపాన ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని బైరవ నగర్ కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాప్తాడు నుండి అనంతపురం కు వస్తుండగా టీవీ టవర్ సమీపాన ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.