దుబ్బాక: భూంపల్లి లో నిర్వహించిన కాంగ్రెస్ సన్నాహక లో పాల్గొన్న రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు
బీఆర్ఎస్ సర్కారు ప్రజలను మభ్యపెట్టిండ్రు కనుకనే... వారిని శాసన సభ ఎన్నికలలో బొంద పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి నీలం మధు కు మద్దతుగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.. భారాస హాయాంలో ఇదిగో డబుల్ బెడ్ రూమ్... అదిగో డబుల్ బెడ్ రూమ్ అంటూ నిరు పేదలను మోసం చేశారని ఆరోపించారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన కార్యకర్తలు ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.