కుప్పం: వన్నెకుల కార్పొరేషన్ డైరెక్టర్ భూపతి మృతి బాధాకరం : ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన వన్యకుల కార్పొరేషన్ డైరెక్టర్ భూపతి విద్యుత్ షాక్ తో మరణించడం బాధాకరమని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం బుధవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, భూపతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. భూపతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.