తాడేపల్లిలో రాష్ట్ర క్రైమ్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ ఏడాది జరిగిన నేరాలు, వాటికి విధించిన శిక్షలపై సమీక్ష చేశారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన భూమిరెడ్డి మధుసూదన్ 8 సంవత్సరాలుగా క్రైమ్ డిపార్ట్మెంట్లో SIగా పనిచేస్తున్నారు. నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ చూపడంతో హోమ్ మంత్రి అనిత చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఈ విషయాన్ని మధుసూదన్ కుటుంబ సభ్యులు ఆదివారం వెల్లడించారు.