షేక్ పేట్: మంచిరేవుల వాసులను భయపెట్టిన చిరుత పులి ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
గండిపేట మండలం మంచిరేవుల సమీపంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత గురువారం చిక్కింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ప్రాంతంలో సంచరిస్తూ చిరుత పులి హైదరాబాద్ వాసులను ఆందోళనకు గురిచేసింది. కొన్ని రోజులుగా దొరకకుండా తిరుగుతూ తాజాగా బోన్ లో చిరుత చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.