నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని శైవ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమామహేశ్వరస్వామి దంపతులు మకర సంక్రాంతి రోజున ఉత్సవమూర్తుల రూపంలో గురువారం కొండదిగి రానున్నారు. మాఘ మాసంలో మహా శివరాత్రి రోజున జరిగే తమ కల్యాణం తిలకించేందుకు తమను నిత్యం ఆరాధించే పాతపాడు, మీరాపురం, సాదుకొట్టం, యాగంటిపల్లె, మాదాసుపల్లె గ్రామ ప్రజలను పెళ్లికి ఆహ్వానిస్తూ ప్రతిఏటా సంక్రాంతి పండుగ రోజున పార్వేట పేరిట కొండదిగి పల్లకోత్సవంలో ఆయా గ్రామాలకు వస్తారు.