ధర్మపురి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఈశ్వర్
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు. మాజీ మంత్రి వెంట డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ సత్తెమ్మ, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.