కామారెడ్డి: భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సిసిఎల్ఏ కమీషనర్ నవీన్ మిట్టల్ లతో కలిసి భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులు, నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.