అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపాన శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ద్విచక్ర వాహనంను ఢీ కొన్న ఆటో . ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న విడపనకల్లు మండలం చీకల గుర్తి గ్రామానికి చెందిన బాలు, ఆంజనేయులుకు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చారు. చీకల గుర్తి నుంచి అనంతపురం టౌనుకు ద్వి చక్రవాహనంలో వస్తుండగా ఉరవకొండ సమీపాన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.