దుబ్బాక: దుబ్బాక - హబ్సీపూర్ రహదారిపై రోడ్డు కు అడ్డంగా పడిపోయిన వృక్షం
ఈదురు గాలులతో కూడిన వర్షం వలన సిద్దిపేట జిల్లా దుబ్బాక నుండి హబ్సిపూర్ వెళ్లే ప్రధాన రహదారి పై ఓ పెద్ద చెట్టు రోడ్డు కు అడ్డంగా పడిపోయింది. రాత్రి నుండి ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో మండలపరిదిలో అక్కడక్కడ రోడ్ల పై చెట్లు నేలకొరగడం జరిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకొని రోడ్డు పై పడిన చెట్లను వెంటనే తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.