ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ప్రకాశం కాలనీలో ఓ వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తాలూకు బంధువులు తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.