ప్రకాశం జిల్లావ్యాప్తంగా డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని శనివారం కలెక్టర్ రాజబాబు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. 2026 జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సరం పురస్కరించుకొని నూతన సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీని ప్రజలందరికీ పెన్షన్లు అందించేందుకు సిద్ధమైనట్లుగా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సంబంధిత అధికారులు పాల్గొంటారని కలెక్టర్ అన్నారు.