కొడంగల్: గోక ఫసల్వాద్ గ్రామంలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోక ఫసల్వాద్ గ్రామంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా దౌల్తాబాద్ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు అశోక్ పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.