పాణ్యం: ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం వార్షికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తుల పురోగతిని సమీక్షిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాపర్టీ కేసుల చేధన, విజిబుల్ పోలీసింగ్, బాధితులకు తక్షణ సహాయం, స్టేషన్ పరిశుభ్రత, సైబర్ నేరాలు–మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు చంద్రబాబు నాయుడు, గుణశేఖర్ బాబు, పాల్గొన్నారు.