నంద్యాల జిల్లాలో 4నీ హత్య చేసిన కేసులో 12 మందికి జీవిత ఖైదు
Nandyal Urban, Nandyal | Mar 30, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి.చింతకుంటలో 2012లో జరిగిన హత్య ఉదంతంలో సోమవారం నంద్యాలఐదో అదనపు జిల్లా జడ్జి కీలక తీర్పునిచ్చారు. కృష్ణారెడ్డి, గోవిందమ్మతో పాటు వారి కుమారుడు, పనిమనిషిని దారుణంగా హత్య చేసిన కేసులో 12 మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు. మొత్తం 19 మంది నిందితుల్లో ఏడుగురు ఇప్పటికే మరణించగా, మిగిలిన వారికి ఈ శిక్ష ఖరారు చేశారు.