మంచిర్యాల: రాజీవ్ నగర్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించి సరైన దృపత్రాలేని 30 ద్విచక్ర వాహనాలు, మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మంచిర్యాల రాజీవ్ నగర్ లో శనివారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్న మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎసిపి ప్రకాష్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని, అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్ఎరమంలో ఎస్సైలు కిరణ్ కుమార్, తిరుపతి, ప్రవీణ్ కుమార్, మాజార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.