అనంతపురం జిల్లా రాప్తాడు మండలం దాదలూరు సమీపాన బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో ఢీకొన్న గుర్తుతెలియని వాహనం. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఎర్రంపల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో కాలు విరగడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతపురం నుండి ఎర్రంపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా దాదలూరు సమీపన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.