ధర్మపురి: వడదెబ్బ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించిన వెల్గటూర్ మండల వైద్యాధికారి డా.స్వరూప
వడదెబ్బ పట్ల వెల్గటూర్ మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మండల వైద్యాధికారిణి డాక్టర్ స్వరూప శనివారం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు బయటకు రాకూడదని సూచించారు. ప్రతిరోజు అధిక మొత్తంలో మంచినీళ్లు తాగాలని అన్నారు. వడదెబ్బ తగిలితే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆమె తెలిపారు.