గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ డివిజన్ స్థాయి పోటీలు ఏర్పాటు చేశారు. వీటిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక వికాసం కలుగుతుందన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో మెలిగి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని ఆయన సూచించారు.